నల్లధనాన్ని నామా రూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు. పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికే పలువురు హీరోలు.. ప్రముఖులు మోడీకి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా స్పందించాడు.
“దేశానికి దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు.. ప్రజల మనిషి – ప్రజల కొరకు – ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్” అంటూ లేటుగా ఇచ్చినా లేటెస్ట్ గా స్పందించాడు. పెద్ద నోట్ల రద్దుపై భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే స్టార్ హోదాలో ఉన్న మహేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారా అని భావించిన వారికి ఉన్న సందేహాలను మహేష్ ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని తన బావ గల్లా జయదేవ్ తన ఎంపీ నిధులతో సూపర్ గా మార్చారని థ్యాంక్స్ చెబుతూ ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతం మహేష్ మురుగదాస్‌తో తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక తన 24వ సినిమాను నవంబర్ 9న లాంచ్ చేశాడు మహేష్. శ్రీమంతుడు సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే దసరాకు విడుదల కానుంది.