బాల‌కృష్ణ ఎన్టీఆర్ లానే ఉన్నారుః మ‌హేశ్ బాబు

288
mahesh ntr
- Advertisement -

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ఎన్టీఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా, ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్రలో బాలీవుడ్ న‌టీ విద్యాబాల‌న్ న‌టించారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నటులు చాలా మంది ఈమూవీలో న‌టించారు. ఈచిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మించారు. తాజాగా ఈమూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఎన్టీఆర్ ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న రావ‌డంతో పాటు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ntr

ఈట్రైల‌ర్ చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు బాల‌కృష్ణ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈమూవీ ట్రైల‌ర్ లో బాల‌కృష్ణ‌ను చూస్తుంటే స్వర్గీయ ఎన్టీఆర్ చూసిన‌ట్టే ఉంద‌ని కొనియాడుతున్నారు. ఈసంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా బాల‌కృష్ణ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నమ్మశక్యం కానంతగా ఒదిగిపోయారని, ఈ ట్రైలర్ మొత్తం అద్భుతంగా వుందని చెప్పాడు.

- Advertisement -