టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. పిల్లల దగ్గర నుండి వృద్దుల వరకు మహేష్ అంటే ఎంతో అభిమానం. దానికి నిదర్శనం ఈ వార్త వింటే మీకే అర్ధమౌతుంది.. రాజమండ్రికి చెందిన ఒక బామ్మ సత్యవతి (106 ఏళ్లు) తనకు మహేష్ బాబు అంటే ఇష్థమని.. ఆయనను చూడాలని.. అతడితో ఒక ఫొటో దిగాలని ఉందని చెప్పడం ఆమద్య మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ విషయం చివరకు మహేష్ బాబు వరకు వెళ్లింది.
అంత పెద్ద మనిషి తనను చూడాలని కోరుకుంటుందని తెలిసిన మహేష్ బాబు వెంటనే స్పందించాడు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న మహేష్ బాబు తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆమెను కలుస్తాను అంటూ హామీ ఇచ్చాడు. తాజాగా ఆ హామీని నెరవేర్చాడు. ఆ బామ్మను హైదరాబాద్కు రప్పించుకొని ఆమెతో కొంత సమయం గడిపాడు.
‘‘ఏళ్లు గుడుస్తుంటే నాపై ప్రేమ పెంచుకోవటం నిజంగా అద్భుతం. నేటి జెనరేషన్ మాత్రమే కాకుండా ఆనాటి వాళ్ళు కూడా నాపై చూపిస్తున్న అభిమానం మరువలేను. 106 ఏళ్ల ఈ బామ్మ నాపై అభిమానంతో ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిజంగా చెప్పాలంటే.. ఆమె నన్ను కలిసినందుకు, తనకంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. ఈ బామ్మను దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు మహేష్.