మహేశ్ అభిమానులకు ఉగాది కానుక ఎంటో తెలుసా?

289
maharshi Teasermaharshi Teaser Poster Poster
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ మహర్షి. పూజా హెగ్డె కథానాయికగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా..ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

ఈమూవీని మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈమూవీ నుంచి ఇప్పటికే విడులైన ఫస్ట్ లుక్ లు, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మహేశ్ అభిమానులకు ఉగాది రోజున ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఆ గిఫ్ట్ ఎంటో కొద్ది సేపటి క్రితమే చెప్పారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

ఉగాది పండుగ రోజున ఉదయం 9గంటల 9నిముషాలకి మహర్షి మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ఓ పొస్టర్ ను విడుదల చేశారు. భరత్ అనే నేను మూవీ తర్వాత మహేశ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈసినిమా మహేశ్ అభిమానులను సంతృప్తి పరుస్తుందో లేదో తెలియాలంటే మే9 వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -