సర్కారు వారి పాట..ప్రేమ సాంగ్

82
Sarkaru-Vaari-Paata
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నారు.

ఈనెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో కీర్తి ‘కళావతి’ అనే పాత్రలో కనిపించనుంది. ఆ పేరుతోనే ఈ పాట మొదలవుతుందని సమాచారం. తమన్‌ అందించిన ట్యూన్‌ అదిరిపోయింది. ఈ పాటతో అందరూ ప్రేమలో పడిపోతారు. ఈ ఏడాది సూపర్‌ హిట్‌ మెలోడీ గీతాల్లో ఇదొకటిగా మిగలనుందని చిత్రబృందం తెలిపింది.

మహేశ్‌ సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -