మహేష్‌ అక్షరాలా….దేవుడే

136
Mahesh Babu looks like God

మహేశ్ బాబు తాజా చిత్రం ఫస్టులుక్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కూడా ఎనౌన్స్ చేయకపోవడం అభిమానుల్లో మరింత ఆత్రుత పెంచుతూ వచ్చింది. వాళ్ల నిరీక్షణ ఈ రోజు ఫలిస్తుందని మురుగదాస్ చెప్పినట్టుగానే  ఫస్టులుక్ ను వదిలారు.మహేశ్ బాబు సీరియస్ లుక్ తో గన్ పట్టుకుని ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్లో మహేశ్ బాబు కొత్త లుక్ తో మరింత గ్లామర్ గా అనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఇంటర్ పోల్ ఆఫీసర్ .. అందుకు తగిన లుక్ తోనే ఆయన ఆకట్టుకుంటున్నాడు.

ఇక మ‌హేష్ స్టైల్‌కి వివాదాస్పద‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఫిదా అయిపోయాడు. మ‌హేష్ బాబు దేవుడిలా ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. ‘అద్భుతంగా ఉంది, మహేష్‌ అక్షరాలా దేవుడిలా ఉన్నాడు’ అని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. స్పైడ‌ర్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని కూడా ఆయ‌న షేర్ చేశాడు. మ‌రోవైపు ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు స‌మాచారం. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, జూన్ 23వ తేదీన విడుదల చేయనున్నారు.