‘థాంక్యూ మై లవ్‌’ అంటు లిప్‌కిస్‌‌ పెట్టిన మహేష్..!

264
Mahesh babu Kiss To Namrata
- Advertisement -

భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రిన్స్‌ మహేష్‌ ఎంతో ఆనందంగా ఉన్నాడట. ముఖ్యంగా అభిమానుల సంతోషం మహేష్ కు ఊరట కలిగిస్తోంది. ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికే కొత్త రికార్డులు సృష్టించిన భరత్ అనే నేను విజయంలో వ్యక్తిగతంగా తనకు అండగా నిలబడిన భార్య నమ్రతా శిరోద్కర్ పాత్ర చాలా ఉందని ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పాడు.

తరచూ తన కుటుంబంతో కలిసి ఫొటోలు దిగుతూ మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఆయన సతీమణి నమ్రత కూడా మహేశ్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కానీ మహేశ్ తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే మాత్రం అందరూ షాక్‌ అవ్వల్సిందే. ఎందుకంటే మహేశ్‌ ఇలాంటి ఫొటో ఎప్పుడూ పోస్ట్‌ చేసి ఉండరు.

ఆ ఫొటోలో మహేశ్‌ తన భార్యను ముద్దాడుతూ కన్పించారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ‘థాంక్యూ మై లవ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. బహుశా మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన నేపథ్యంలో క్రెడిట్‌ అంతా తన భార్యకు అంకితం చేస్తూ ఈ ఫొటో పోస్ట్‌ చేశారేమో! ఇప్పటికే ఈ ఫొటోకు లక్షకు పైగా లైకులు వచ్చాయి. ఈ ఫొటో చూసి ‘నమ్రత ప్రపంచంలోనే అదృష్టవంతురాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మహేశ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో మహేశ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం ఇటీవల మహేశ్‌ అమెరికా వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ‘భరత్‌ అనే నేను’ లాగే ఈ సినిమా కూడా బాగుంటుందని మహేశ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

- Advertisement -