‘గుంటూరు కారం’ ట్రైలర్ పైనే చూపులన్నీ!

42
- Advertisement -

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, శ్రీలీల జంట‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న‌ సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాపై ఫ్యాన్స్‌కు భారీ అంచ‌నాలున్నాయి. తాజాగా గుంటూరు కారం ట్రైలర్ పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో.. జనవరి 8న గుంటూరు కారం ట్రైలర్ ను విడుదల చేస్తారనే టాక్ ఉంది. రీసెంట్ గా నిర్మాత నాగవంశీ కూడా ఓ ఈవెంట్ లో ఈ ట్రైలర్ మీద ఓ సూపర్ అప్ డేట్ ఇచ్చారు. గుంటూరు కారం నుంచి రాబోయే ట్రైలర్ లో త్రివిక్రమ్ సృష్టించే కొత్త ప్రపంచం ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ కామెంట్స్ చేశాడు. ఇక జనవరి 8న ట్రైలర్ రిలీజ్ పక్కా అంటున్నారు. దానికి సంబందించిన వర్క్ కూడా చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఐతే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై సాలిడ్ అప్ డేట్స్ వినిపిస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ షాట్స్ అండ్ ఎలిమెంట్స్ తో గుంటూరు కారం ట్రైలర్ స్టార్ట్ అవుతుంది అని, గుంటూరు మార్కెట్ యార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మొదలయ్యే ఈ ట్రైలర్ లో మహేష్ పూర్తిగా రఫ్ లుక్ లో కనిపిస్తాడని.. పైగా మహేష్ కంప్లీట్ యాక్షన్ మోడ్‌‌లో సాగుతాడని.. మధ్యలో త్రివిక్రమ్ మార్క్ కంటెంట్ ఉన్నా.. ట్రైలర్ లో ఎక్కువగా యాక్షనే హైలైట్ అవుతుందని తెలుస్తోంది. సహజంగా త్రివిక్రమ్ షాట్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక యాక్షన్ మోడ్ లో మహేష్ బాబు ఎలాగూ ఇంప్రెస్ చేస్తాడు.

అంటే.. ఒక్కమాటలో గుంటూరు కారం ట్రైలర్ ఎక్సలెంట్ గా ఉండబోతుంది అన్నమాట. మొత్తానికి మహేష్ బాబు పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయట. ప్రస్తుతం ఈ ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికితోడు టైటిల్ తోనే త్రివిక్రమ్ క్యురియాసిటీ సృష్టించాడు. ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి గుంటూరు కారం పై ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Also Read:రైతుబంధు ఇప్పట్లో లేనట్లే..?

- Advertisement -