కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు..

147
mahesh_babu
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విలయతాండవం చేస్తోంది.ఈ నేప‌థ్యంలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. సెల‌బ్రిటీలు సైతం వ్యాక్సిన్ వేసుకుంటూ ప్రజలందరూ టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆదివారం రోజు టీకా తీసుకున్నఆయ‌న మీరంద‌కు కూడా తీసుకోండి అంటు ట్వీట్ చేశారు.

కోవిడ్ 19 సెకండ్ వేవ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇది తీవ్ర‌మైన ఇబ్బంది పెడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే1వ తేదీ నుండి టీకా వేసుకోవడానికి అర్హులు. అందరూ టీకా వేయించుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

- Advertisement -