శ్రీవారి సన్నిధిలో మహేష్ ఫ్యామిలీ, వరుణ్‌ తేజ్ -లావణ్య

9
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మహేష్ బాబు ఫ్యామిలీ, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి. గురువారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్ ,కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితార శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అలాగే వరుణ్ తేజ్ – లావణ్ త్రిపాఠి, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీల అధినేత కృష్ణారెడ్డి సతీమణి మేఘా సుధారెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

నమ్రత తన పిల్లలతో కలిసి అలిపిరి మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Also Read:జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదంపై వదంతులు

- Advertisement -