మహేష్‌ కూతురు క్యూట్ డాన్స్‌.. వీడియో వైరల్‌

271
Mahesh Babu Daughter
- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలతో పాటు తన ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంటారు. ఇక మహేష్‌ సోషల్‌ మీడియాలో చురుగా ఉంటారు. ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా మహేష్‌ గారాలపట్టి సితార డ్యాన్స్‌తో అలరించింది. ‘బాహుబలి’ సినిమాలోని ‘మురిపాల ముకుంద..’అనే పాటకు సితార డ్యాన్స్‌ చేసింది. ఆ సమయంలో తీసిన వీడియోను మహేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి‘వాట్‌ ఎ టాలెంట్‌‌.. మై సీతా పాప’అని కామెంట్‌ పెట్టారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మహేష్‌తో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. నిజంగానే సితార సూపర్‌ టాలెంటెడ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మహేష్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘మహర్షి’మూవీలో నటిస్తున్నారు. పూజా హేగ్డే హీరోయిన్‌గా అలరించనుంది.

- Advertisement -