గుంటూరు కారం మూవీ టీంతో నిర్వహించిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో ప్రిన్స్ మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. డ్యాన్స్ ఇరగదీశారు అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘రెండు పాటలకు డాన్స్ మాత్రం బాగా చేయాలని ముందు నుంచి నేను త్రివిక్రమ్ అనుకున్నాం. ఎందుకంటే తర్వాత రెగ్యులర్గా తెలుగు సినిమా పాటలు చేస్తామో లేదో తెలీదు. ఇది నేను చేసే చివరి తెలుగు సినిమా అవ్వొచ్చు’ అని మహేష్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం త్వరలో క్లాప్ కొట్టుకోవడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ ఏడాది సమ్మర్ ఎండింగ్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇక ఓన్లీ పాన్ ఇండియా సినిమాలే చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే, ఆ ఉద్దేశ్యం తోనే మహేష్ పై విధంగా కామెంట్స్ చేశాడు అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి బోలెడు పుకార్లు వినిపించాయి. ఓ తెలుగు వాడు.. ఆఫ్రికాలో అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ మనుషులు, వాతావరణం, చెట్లూ, చేమలూ అన్నీ కొత్తగా ఉండబోతున్నాయట. మొత్తమ్మీద మహేష్ బాబు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసే మూడ్ లో లేడు.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద వెనుక పడింది. పైగా ఈ సినిమా పై బాగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయాయి. మహేష్ గతంలో స్మోకింగ్ మానేసి తాను పొగాకు ఉత్పత్తులను ప్రమోషన్ కూడా చేయనని నిర్ణయం తీసుకోగా.. ఈ సినిమాలో ఎక్కువగా బీడీ తాగుతూ కనిపించాడు. దీంతో అతని ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వాడింది నిజమైన బీడీ కాదని ఆయుర్వేద బీడీ అని మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read:AP:రాజధానికి దారేది?

