మహేశ్‌ సూపర్ స్టారే!

71
mahesh babu
- Advertisement -

తెలుగు తెర రాకుమారుడు … పడుచుపిల్లల మనసు దోచే గ్రీకువీరుడు . అదరక బదులే చెప్పేటి నిప్పుకణం అతడు. భారీ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన బిజినెస్ మ్యాన్. చిరునవ్వుతోనే బ్రహ్మోత్సవం చేసే శ్రీమంతుడు. రాజకుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పోకిరిగా హల్ చల్ చేసి.. అభిమానులకు గుండెల్లో మురారిగా మారి స్పైడర్‌గా చెరగని ముద్రవేసుకున్న ప్రిన్స్ మహేశ్ బాబు.. పుట్టిన రోజు నేడు. మహేశ్ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియచేస్తున్నారు.

ఇక తెరపైనే కాదు రియల్ లైఫ్‌లోనూ మహేశ్‌ సూపర్ స్టారే. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో జీవితాలని ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటివరకు దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

హుదుద్‌ తుఫాను సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా రూ.2.5 కోట్లు, కరోనా సమయంలో సినిమా కార్మికులకు కోసం రూ. 25 లక్షలు అందించాడు. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా మహేష్ అవసరమైన సహాయాన్ని చేశారు. ఇక మహేశ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు సైతం తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

- Advertisement -