యువ నాయ‌కుడికి పుట్టిన‌రోజు శుభాకాంక్షాలుః మ‌హేశ్ బాబు

291
ktr, mahesh babu
- Advertisement -

తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ జ‌న్మ‌దినం పుర‌స‌ర్క‌రించుకుని ప‌లువురు నాయకులు, అభిమానులు, సెల‌బ్రెటీలు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు, టీఆర్ ఎస్ నాయ‌కులు కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రొకొంత మంది అభిమానులు ర‌క్త దాన శిబిరాల ఏర్పాటు చేయ‌డంతో పాటు, అన్న‌దాన కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు.

Mahesh, ktr

తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మంత్రి కేటీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్షాలు తెలిపారు. వీరిద్ద‌రి మ‌ధ్య చాలా మంచి స్నేహం ఉంద‌న్న విషయం మ‌న‌కు తెలిసిందే. మ‌హేశ్ బాబు రీసెంట్ గా న‌టించిన‌ భ‌ర‌త్ అనే నేను సినిమాను మ‌హేశ్ బాబుతో క‌లిసి వీక్షించారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా వీరిద్ద‌రు క‌లిసి ఓ ఇంట‌ర్యూను కూడా చేశారు. భ‌ర‌త్ అనే నేను సినిమా చూసిన అనంత‌రం కేటీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ విషెష్ తెలిపాడు మ‌హేశ్ బాబు.

మంచి స్నేహితుడు, యువ నాయ‌కుడు, యువ‌త‌కు ఆద‌ర్శం, మాన‌వ‌త్వం ఉన్న మంచి మ‌నిషి కేటీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్షాలు అంటూ మ‌హేశ్ ట్వీట్ చేశారు. ఇక మ‌హేశ్ బాబు చేసిన ట్వీట్ మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ధ‌న్య‌వాదాలు మ‌హేశ్ అంటూ పోస్ట్ చేశారు. ఈసంద‌ర్భంగా చాలా మంది అభిమానులు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ట‌ర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు.తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. ’42వ జన్మదినం సందర్భంగా కేటీఆర్ కు నా బెస్ట్ విషెస్. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఉండాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -