సీఎం మహేష్‌ లుక్ ఇదే…!

272
Mahesh Babu Bharat Ane Nenu Leaked Look
- Advertisement -

స్పైడర్ చిత్రం తర్వాత ప్రిన్స్  మహేష్ నటిస్తున్న చిత్రం భరత్‌ అను నేను. శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌ సీఎంగా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఈ మూవీకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అసెంబ్లీ సీన్‌లో పోసాని కృష్ణ మురళి కూర్చున్న సన్నివేశం లీకవగా తాజాగా  మహేష్‌కి సంబంధించిన లుక్‌ లీకైంది.

ఇందులో మహేష్ ఇన్ షర్ట్ వేసుకొని చాలా హ్యండ్సమ్ గా కనిపిస్తున్నాడు. మహేష్ తన గన్ మెన్ లతో కలిసి నడిచి వస్తుండగా, వెనుక బ్రహ్మజీ ఉన్నారు. యంగ్ హీరో సీఎం అయితే ఎలా ఉంటాడో చూపించాడు ప్రిన్స్. చిత్ర బృందం ఇచ్చిన ఈ సడెన్ సర్ ప్రైజ్ ఫ్యాన్స్ కి మాత్రం మాంచి కిక్ ఇస్తుంది.

అయితే, సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ లీకవడం పట్ల దర్శకుడు కొరటాల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చేస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్ బేనర్పై నిర్మితమవుతుండగా, ఇందులో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -