9న అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ..

190
Online News Portal
mahesh-babu-as-chief-minister
- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2017 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి ‘ఏజెంట్‌ శివ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా ప్రారంభించేస్తున్నాడు మహేష్.

1472623367_superstar-mahesh-babus-much-anticipated-yet-untitled-telugu-project-filmmaker-r-murugadoss-went

మహేష్‌ కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్‌ను నవంబరు 9న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. సందేశాత్మక కథతో నిర్మించనున్న ఈ చిత్రానికి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. ఇందులో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ఇప్పటికే ప్రకటించినట్టుగా కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు.

Srimanthudu(8)

సాధారణంగా తన సినిమాల ఓపెనింగ్ కార్యక్రమాలకు మహేష్ హాజరుకాడు. అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ కొరటాలతో చేయబోయే సినిమాను కూడా మహేష్ లేకుండానే మొదలు పెడుతున్నారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిన విషయమే.

Mahesh-Babu-Birthday-Poster

ఇక మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పీవీపీ బ్యానర్లో మహేష్ మరో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మహేష్ నుంచి గాని, పీవీపీ సంస్ధ నుంచి గాని ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో వంశీ, మహేష్ల కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపించింది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ.., ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబుతో తమ నెక్ట్స్ సినిమా వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమవుతుందని తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -