భరత్ అనే నేను సినిమా అందించిన హిట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు హీరో మహేష్. తన తర్వాతి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న మహేష్…రిలీజ్ విషయంలోనూ పాత సెంటిమెంట్‌కే జై కొడుతున్నాడు. పూరి జగన్నాథ్-మహేష్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్ని తిరగరాసింది. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన పోకిరి యూత్‌ని బాగా ఆకట్టుకుంది. 2006 ఏప్రిల్‌లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది.
గతేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా మర్చిపోలేని హిట్ గా మిగిలిపోయింది. కానీ మే లో విడుదలైన సినిమాలు మాత్రం మహేష్ కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. మే నెలలో విడుదలైన ‘నాని’ ,’బ్రహ్మోత్సవం’ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలాయి.
అందుకే మహర్షి విషయంలో తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్‌కే జైకొట్టాడు మహేష్. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్‌లోనే అది ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మహేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో వేచిచూడాలి.