మహేశ్ బాబుతో జగ్గూభాయ్..

127
JagapathiBabuMaheshBabu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈమూవీ మే9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈమూవీ తర్వాత ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేయనున్నాడు మహేశ్ బాబు. ఈమూవీలో మహేశ్ కు జోడిగా రష్మీక మందనను తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈమూవీలో మహేశ్ కు విలన్ గా జగపతి బాబును తీసుకున్నట్లు సమచారం.

జగపతి బాబు ను మరో ప్రత్యేకమైన పాత్రలో చూపించడానికి రెడీ అయ్యాడు అనిల్ రావిపూడి. మహేశ్ బాబు , జగపతి బాబు శ్రీమంతుడు సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. మహర్షి మూవీ విడుదలైన కొద్ది రోజుల తర్వాత ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు సమచారం. ఈమూవీని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.