‘మ‌హ‌ర్షీ’ హిందీ శాటిలైట్ రైట్స్ రూ.20కోట్లు..

146
maharshi

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు 25వ సినిమాకు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈచిత్రంలో మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్దె న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈమూవీ షూటింగ్ విదేశాల్లో చిత్ర‌క‌రణ జ‌రుగుతోంది. ఈసినిమాను ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వ‌నీద‌త్ లు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈమూవీ హిందీ శాటిలైట్ హ‌క్కుల విష‌యంలో భారీ రేట్ కు డీల్ కుదుర్చుకున్నారు నిర్మాత‌లు.

maharshi pics

ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు బాలీవుడ్ లో కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో అక్క‌డ కూడా తెలుగు సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంది. దింతో తెలుగు సినిమాల‌ను భారీ మొత్తంలో డ‌బ్బులు పెట్టి కొంటున్నారు బాలీవుడ్ నిర్మాత‌లు. దింతో మ‌హేశ్ 25వ స‌నిమా మ‌హ‌ర్షీ హిందీ శాటిలైట్ హ‌క్కుల‌ను 25కోట్ల‌కు చెప్పారట దిల్ రాజు. 20కోట్లు చెల్లించ‌డానికి ఒ సంస్ధ ముందుకు రావడంతో ఒకే చెప్పేశారు నిర్మాత‌లు.

maharshi director

ఈసినిమాను స‌మ్మ‌ర్ లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్. గ‌తంలో రంగ‌స్ధ‌లం మూవీ హిందీ శాటిలైట్ రైట్స్ ను 22కోట్ల‌కు అమ్ముడుపోగా, మ‌హ‌ర్షీ 20కోట్ల‌తో రెండ‌వ స్ధానంలో నిలిచింది. బాలీవుడ్ లో మూవీ శాటిలైట్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డంతో ఆనందంలో ఉన్నారు చిత్ర‌బృందం.