హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.మొత్తం 8 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర రికార్డులు తిరగరాసినట్టు మేకర్స్ చెబుతున్నారు.
ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులు ఈ సినిమా 8 రోజుల్లో 60 కోట్లకి పైగా గ్రాస్ తో క్రాస్ చేసినట్టు తెలిపారు. ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది.
Also Read:KVN ప్రొడక్షన్స్‌తో బాబీ!
