డిజిటల్ స్ట్రీమింగ్‌లో మహాసముద్రం..

87
maha samudram
- Advertisement -

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించగా అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు.

భారీ అంచనాల మధ్య గత నెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది. దాంతో ఎన్నో ఆశలు పెట్టున్న హీరో హీరోయిన్స్‌కు, దర్శకుడు అజయ్ భూపతికి నిరాశ తప్పలేదు. కాగా, ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో ‘మహా సముద్రం’ స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

- Advertisement -