మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మహర్షి’.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, సి. అశ్వనిదత్, ప్రసాద్ వీ. పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరించారు. మే 9, 2019న విడుదలయైన ఈ సినిమా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద 170 కోట్ల రూపాయలను వసూల్ చేసింది.
అయితే తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనతను సోంతం చేసుకుంది. ఈ మూవీ 2019 సంవత్సరానికి గాను ట్విట్టర్‌లో అత్యంత ప్రభావితం చేసే అంశాలలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ చిత్రంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు దర్శకుడు వంశీ పైడిపల్లి.
We would like to Thank the Fans of Superstar @urstrulymahesh for making our Epic Blockbuster #Maharshi one of the top influential moment on Twitter in 2019!🔥⚡@directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP pic.twitter.com/1mW5xzjSLH
— Sri Venkateswara Creations (@SVC_official) November 13, 2019