ప్రిన్స్ మహేశ్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రైతు కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుండగా ఏప్రిల్ 25న సినిమా
విడుదలకానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ మూవీ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈసినిమాలో మహేష్ వివిధ రకాల గెటప్స్ లో కనిపించినట్లుగానే షారూక్ ‘స్వదేశ్’ మూవీలో కూడ కనిపించాడు. అయితే ఈకథకు మన పురాణాలకు సంబంధించిన కృష్ణుడు కుచేలుడు కథను ప్రాతిపదికగా తీసుకుని వంశీ పైడి పల్లి ‘మహర్షి’ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు టాక్. స్వదేశ్ కథకు స్వల్ప మార్పులు చేసి మహర్షిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట వంశీ.
మహేశ్ బాబు 25వ సినిమా కావడంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. దాదాపు 80 శాతం షూట్ పూర్తైపోయింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.