మహర్షి..ఆ రెండు చోట్లా భారీ నష్టాలే..!

463
maharshi dilraju
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఎపిక్ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన నాలుగురోజుల్లోనే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక నైజాంలో దిల్ రాజు,మహేష్ తమకు మరోసారి తిరుగలేదనిపించుకోగా సీడెడ్‌(రాయలసీమ)లో మాత్రం నిరాశనే మిగిల్చింది. ఇక్కడ మహర్షి రైట్స్‌ రూ.12.6 కోట్లకు అమ్ముడు పోగా తొలివారంలో రూ.6.86 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. తొలివారంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఫుల్‌ రన్‌లో రూ.8 కోట్ల షేర్ అందుకుంటే ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో బయ్యర్లకు మూడో వంతు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

ఇక యూఎస్‌లోనూ మెప్పించలేకపోయాడు మహేష్. అక్కడ పబ్లిసిటీ ఖర్చులు కలుపుకొని బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలంటే షేర్ 14 కోట్లు రావాలి. అంటే మహర్షి సుమారు 4 మిలియన్ డాలర్లను వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం మహర్షి 1.6 మిలియన్ డాలర్లను మాత్రమే రాబట్టింది. ఫుల్‌ రన్‌లో 2.5 మిలియన్ డాలర్లు అందుకోవడమే కష్టం.ఈ నేపథ్యంలో అక్కడ మహర్షి నష్టాలను మిగుల్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -