1,2,3,4,6,7,8,9…తొలి పది ఫలితాల్లో 7 ర్యాంకులు కైవసం..ఇది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రాగానే మనకు కనిపించే,వినిపించే దృశ్యం. ఇక కొంతమంది స్టేట్ టాపర్ ఎవరు..ఏ స్కూల్ ఎక్కువ ర్యాంకులు సాధించింది..ఎంతమంది పాస్ అయ్యారు అనే విషయాలు తెలుసుకోవడానికి అంతా ఆసక్తికనబరుస్తారు.
కానీ మహారాష్ట్రలో ఓ విద్యార్థి సాధించిన మార్కులతో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. టాపర్లకు వచ్చిన కవరేజ్ కంటే ఈ విద్యార్థి గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ విద్యార్థి ఎన్నిమార్కులు సాధించాడు అనుకుంటున్నారా..35 మార్కులు. అదేంటి 35 మార్కులు చాలామందికి వస్తాయి కదా అనుకుంటున్నారా..ఇక్కడే ఉంది అసలు ట్వీస్ట్.
ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 35 అంటే బార్డర్ మార్కులతో పాసయ్యారు. దీంతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. గత శనివారం మహారాష్ట్ర టెన్త్ బోర్డు ఫలితాలను రిలీజ్ చేసింది. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్ రిజల్ట్ చూసే సరికి షాకైపోయాడు. ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కులు వచ్చాయి. తన మార్కులు చూసి అక్షిత్ షాకయ్యాడు.
అక్షిత్ తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. తరువాత ఇక స్కూల్‌కు వెళ్లలేదు. టెన్త్ పరీక్షలు ప్రైవేటుగా రాసి ఇలా బార్డర్ మార్కులు తెచ్చుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.