మహారాష్ట్ర లో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేదార్ రాయ్ జి రావ్ పటేల్ కే …నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారిని కలిసి విన్నవించారు.
మా గ్రామలన్ని తెలంగాణ రాష్టానికి దగ్గరగా ఉన్నాయని కానీ మా గ్రామలు అభివృద్ధి కి నోచుకోవడం లేదని కేదార్ రాయ్ పటేల్ తెలిపారు. తెలంగాణ రాష్టం లో అమలయ్యే సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మా రాష్టం లో అమలు కావడం లేదన్నారు.
తెలంగాణ లోముఖ్యంగా రైతులకు ఎకరానికి ఏడాదికి 10000/- రూపాయలు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్,2 వేల రూపాయల ఫించన్ ఇస్తే మహారాష్ట్ర లో కేవలం 6 గంటల కరెంట్ 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్టం లో ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్స్, ఆడ బిడ్డలకి కల్యాణ లక్ష్మీ, పండుగలకి బట్టలు ఇస్తున్నారు. పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య అందిస్తూన్నారు. కానీ మా రాష్టం లో ఇలాంటి పథకాలు అమలు కావడం లేదన్నారు.
తెలంగాణలో రోడ్లు బాగున్నాయి కానీ మా దగ్గర ఇప్పటికి కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు.మా ప్రాంతం నుండి గోదావరి ప్రవహిస్తున్న తాగునీటి కి సాగు నీటి కి నీళ్లు లేని పరిస్థితి ఉందన్నారు.సాగునీటి విషయం లో తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించారు.
ఇటువంటి పరిస్థితి నేపథ్యం లో మా ప్రాంతం కూడా అభివృద్ధి లో సంక్షేమం లో ముందుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ తరపున నయిగాన్ -89 శాసన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.తమ విన్నపాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావ్ దృష్ఠికి తీసుకెళ్లాలని కోరారు.దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గణేష్…సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు
కేదార్ రాయ్ పటేల్…బయోగ్రఫీ
()వసంత్ రావ్ నాయక్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్
() యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
()శేషా రావు రావ్ పాటిల్ సంస్థ చైర్మన్
() జీజావ్ పబ్లిక్ లైబ్రరీ చైర్మన్
() శంబు రాజే వ్యాయమ శాల చైర్మన్
()గార్గి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
()శ్రీ సాయి మల్టి సర్వీసెస్ ప్రోప్రయటర్
() నాందేడ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు దుగాన్ సర్పంచ్ గా పని చేశారు