మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని కలవర పెడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 13,659 పాజిటివ్ కేసులు నమోదుకాగా గడిచిన 24 గంటల్లో పుణెలో కొత్తగా 2840 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం పుణెలో 17,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక్క పుణెలోనే కరోనాతో ఇప్పటి వరకు 9,356 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ఔరంగాబాద్‌లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇక నాగపూర్‌లో మార్చి 15 నుంచి 21వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ప్రయివేటు ఆఫీసులను పూర్తిగా మూసివేయనున్నారు.