- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరిమాతకు పూజలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని అన్నారు. ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలకు అందించిన కానుకగా పేర్కొన్నారు. రికార్డు వేగంతో ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని కొనియాడారు.
- Advertisement -