ఇద్దరి మధ్య.. శర్వా కుమ్మేస్తున్నాడు.. !

246
Mahanubhavudu Collections
- Advertisement -

శర్వానంద్ లేటెస్ట్‌ మూవీ’మహానుభావుడు’ ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక వైపున ‘జై లవ కుశ’ మరో వైపున ‘స్పైడర్’ థియేటర్స్ లో సందడి చేస్తుండగా విడుదల కావడం విశేషం.

యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమాను మారుతి తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న కంటెంట్ ఈ రెండు వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి బాగానే రప్పిస్తోంది.

 Mahanubhavudu Collections

తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల షేర్ ను రాబట్టింది. శర్వానంద్ కెరియర్లోనే తొలి రోజున ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

రెండు భారీ సినిమాల మధ్య ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కడం సామాన్యమైన విషయమేం కాదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -