లెజండరీ కథానాయకి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ విజయ్ దేవరకొండ,సమంత స్కూటర్‌లో వెళుతున్న పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో సమంత జర్నలిస్టుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎన్‌ఆర్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్య నటించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ.. “మా టెక్నికల్ టీమ్ ఎంతో నేర్పుతో క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడకుండా “మహానటి” లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి మా బ్యానర్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, సినిమాటోగ్రఫీ: డాని, ఆర్ట్ సూపర్విజన్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: ప్రియాంక దత్, దర్శకత్వం: నాగఅశ్విన్.