సమంత మహానటికి భారీ ఆఫర్!.

212
Mahanati Overseas Rights Sold For A Fancy Rate
- Advertisement -

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మహానటి. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత మరో కీలక పాత్ర పోషించనుంది. సావిత్రి భర్తగా మలయాళ నటుడు జెమినీ గణేషన్ నటిస్తున్నాడు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు అప్పుడే ప్రీ బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను భారీ మొత్తానికి నిర్వాణ సినిమాస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4.5 కోట్లను ఆఫర్ చేసింది.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ఇంత పెద్ద మొత్తంలో ధర పలకడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.   ఓవర్సీస్ లో ‘ఆనందో బ్రహ్మ’ .. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలను రిలీజ్ చేసి లాభాలను చూసిన నిర్వాణ సినిమాస్ మహానటి రైట్స్ కూడా సోంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగులో ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్ .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యారు.   మరికొంతమంది నటులను ఎంపిక చేయాల్సి వుంది. అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -