‘మహానటి’ సక్సెస్ మీట్..

297
Keerthy Suresh
- Advertisement -

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది ఈ మహానటి చిత్రం. సినిమా విడుదలై మూడో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ కీర్తి సురేష్, హీరో విజయ్ దేవరకొండ, రచయిత బుర్రా సాయి మాధవ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది.

స్వప్న దత్ మాట్లాడుతూ…మూడో వారం కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది మహానటి సినిమా. ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఇంకా మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచన వస్తోంది. రాజేంద్ర ప్రసాద్, నాగ చైతన్య ఇలా ప్రతి ఒక్కరు మా సినిమా చేసినందుకు ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన మీడియాకు పెద్ద థాంక్స్.

Keerthy Suresh

బుర్రా సాయి మాధవ్…మంచి సినిమా చూసున్నారు ప్రేక్షకులు. మహానటి మంచి సినిమా మంచి సినిమా. ప్రేక్షకులు న్యాయ నిర్ణేతలు. వారికి ఎన్ని కృతజ్ఞతలు. కీర్తి సురేష్ ను చూస్తుంటే సావిత్రిని చూసినట్లే ఉంది. ఆడియన్స్ కు పెద్ద థాంక్స్.

ప్రియాంక దత్ మాట్లాడుతూ…మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మహానటి సినిమా మాపై భాధ్యతను పెంచింది. సినిమాను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…జనాలు వచ్చి సినిమాను చూస్తారని ఆశించాం. నేను ఏదైతే అనుకున్నానో ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ గా నాకు హ్యాపీ గా ఉంది. ఈ సినిమాకు భాగం అయినందుకు గర్వాంగా ఉంది. సినిమాను వెనక ఉండి నడిపించిన అందరికి థాంక్స్ చెబుతున్నాను. సినిమా మొదలైన దగ్గరి నుండి అందరు బాగా సపోర్ట్ చేయడం జరిగింది.

Keerthy Suresh

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…సావిత్రి లైఫ్ చూసి నేను షాక్ అయ్యాను. వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించడం గొప్ప విషయం. నాగ్ అశ్విన్ సినిమాను నడిపించిన విధానం గ్రేట్. మహానటి లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత నాగ్ అశ్విన్ తో చేసిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ హాడ్ వర్క్ నేను దగ్గరుండి చూశాను.

కీర్తి సురేష్ మాట్లాడుతూ…నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. డైరెక్టర్ నాగి, స్వప్న, ప్రియాంక నాకు అందించిన సహకారం మరువలేనిది. సాంకేతిక నిపుణులందరికి ధన్యవాదాలు. అమ్మ, నాన్న లకు థాంక్స్. వారి సహకారం మరువలేనిది. అందరు కష్టపడ్డారు కాబట్టి సినిమా విజయం సాధించింది. ఈ సక్సెస్ నేను మర్చిపోలేను.

- Advertisement -