ఎట్టి ప‌రిస్ధితుల్లో పార్టీ మార‌నుః ఎంపీ సీతారాం నాయ‌క్

276
mp setaram
- Advertisement -

ఎట్టి ప‌రిస్ధితుల్లో పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ సీతారాం నాయ‌క్. తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న వార్తల్లో నిజం లేద‌న్నారు. కొంత మంది త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని చెప్పారు. ఈసంద‌ర్భంగా నిన్న టీఆర్ఎస్ చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాను కూడా పార్టీ మార‌బోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. సీఎం కేసీఆర్ పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని ఉద్య‌యం స‌మ‌యం నుంచి తాను కేసీఆర్ వెన్నంటే ఉన్నాన‌ని చెప్పారు.

mp setaram

తనకు రాజకీయ భవిష్యత్ నిచ్చి, ఎంపీ గా అవకాశం కల్పించిన కేసీఆర్ ను ఎన్నడూ విడవనని అన్నారు. త‌న‌కు పార్టీ మారాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌న పార్ల‌మెంట్ స్ధానంలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ ను గెలిపిస్తాన‌ని చెప్పారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు కుట్ర‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు.

- Advertisement -