అమ్మతోడు..ఇక నుంచి లంచాలు తీసుకోంః ప్రభుత్వ ఉద్యోగులు

324
collector ronald Rose
- Advertisement -

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు విరుద్దంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 15 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, సర్పంచులతో లంచాలు తీసుకోబోమంటూ ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు, పిల్లలపై ఒట్టు వేసి మరీ ఈ ప్రతిజ్ఞ చేయించారు.

స్వయంగా ఈ ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్‌, ప్రత్యేక అధికారి క్రాంతి, ఇతర ఉన్నతాధికారులు.. అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులతో, సర్పంచులతో వేర్వేరుగా ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, సర్పంచులతో ప్రమాణపత్రంపై సంతకాలు చేయించారు. దేవుడిపై ప్రమాణం చేస్తే చేసిన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేస్తారని, కాబట్టి పిల్లలపై ప్రమాణం చేయాలని చెబుతూ స్వయంగా ఆయన తన పిల్లలపై ప్రమాణం చేశారు.

ప్రత్యేక అధికారి క్రాంతి తన తల్లిదండ్రులపై ప్రమాణం చేయగా, మిగతా ఉద్యోగులు వారిని అనుసరించారు. అవినీతిని రూపు మాపేందుకు తామంతా నిర్ణయించుకున్నామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్‌కు స్పష్టం చేశారు.

- Advertisement -