మహావతార్ నరసింహ..వసూళ్ల జోరు!

6
- Advertisement -

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. రిలీజ్ రోజు 80 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో అమ్ముడుపోతే మంగళవారం ఏకంగా 2 లక్షల 30 వేలకి పైగా టికెట్స్ సేల్ అయ్యాయి.

ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ మరియు క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

Also Read:ఉస్తాద్…పవన్ లుక్ అదుర్స్!

- Advertisement -