హిందూ పండగలన్ని తిధులతోను,నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. మహా శివరాత్రి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివనామస్మరణతో అనుకున్నది నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి.
మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి ఉపవాసం ఉండటం ,రాత్రి జాగరణ చేయడం ,శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం. పరమేశ్వరుడు భక్తసులభుడు. తలపై కొద్దిగ గంగనుపోసి విభూది రాస్తేచాలు పరవశుడై అడకనే వరాలు గుప్పించే బోలా శంకరుడు. ఆస్వామిని కొలచి యక్ష,కిన్నెర ,గంధర్వ ,దేవగణాలేకాదు రాక్షసులు సహితము శుభాలను పొందారు. ప్రతినెలలోనూ అమావాస్య ముందువచ్చే చతుర్ధశి నాడు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమయినరోజు. దానినే మాస శివరాత్రి అంటారు. మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అనిపిలుస్తారు.
ప్రాత:కాలం నుండి ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి దేవున్ని మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టాఐశ్వరాలు,సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి.శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే అభిషేక ప్రియుడు అంటారు.భక్తితో నీళ్ళతో అభిషేకం చేసిన భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివునికి బోళాశంకరుడని పేరు.మహాశివరాత్రి అంటేనే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏరోజైతే చేస్తారో అదేరోజు మహాశివరాత్రిగా జరుపుకోవడం మనకు సాంప్రదాయంగా వస్తున్న
ఆచారం.