శ్రీశైలంలో మహా పుష్పాభిషేకం!

2
- Advertisement -

పుణ్యక్షేత్రాల్లో అరుదుగా జరిగే “మాహా పుష్పాభిషేకం” ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 15 సంవత్సరాల తర్వాత శ్రీశైలం దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి అద్భుతంగా, అత్యంత వైభవంగా జరగనుంది. సుమారు 4 వేల కేజీల, 30 కి పైగా వివిధ రకాల పూలతో ఈ కార్యక్రమం జరుగుతుంది.

దాదాపు పదిహేనేళ్ళ తర్వాత ఈ పుణ్యక్షేత్రంలో ఈ మహా పుష్పాభిషేకం జరగనుండడం విశేషం.. ఈ కార్యక్రమం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ దంపతుల చేతుల మీదగా ఈ పుష్ప సేవా కార్యక్రమం జరుగుతుంది.

గతంలో 2009 లో బ్రహ్మశ్రీ చాగంటి చేతుల మీదుగా నిర్వహించగా.. ఈ ఏడాది ఆర్సీవై దంపతుల చేతుల మీదుగా నిర్వహించనున్నారు.. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశంలో అన్ని వైష్ణవ ఆలయాల్లో ఆ రోజు విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ.. చాల అరుదుగా శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంలో ఇలాంటి అద్భుత కార్యక్రమం జరగడం అరుదు, విశేషం.

ALso Read:ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్

- Advertisement -