జూబ్లిహిల్స్ నియోజకవర్గం లో దివంగత ఎమ్మెల్యే సేవలను గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు మాగంటి సునీత గోపీనాథ్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత గోపినాథ్ సతీమణి సునీతను ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. గోపన్న ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు వెళ్తాను…గోపన్న అకాల మరణంతో జూబ్లిహిల్స్ లో ఉపఎన్నిక వచ్చింది అన్నారు. గోపన్న మరణం నుండి మాకు మాకు నియోజకవర్గం కుటుంబ సభ్యులకు కేటీఆర్ అండగా ఉన్నారు..కేసీఆర్ టికెట్ కేటాయించడం సంతోషంగా ఉంది…వారికి నా కృతజ్ఞతలు అన్నారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గం ప్రజలు మా కుటుంబ సభ్యులు…ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రైన పోన్ చేస్తే గోపన్న పోన్ ఎత్తేవారు.వారికి అండగా ఉన్నారు అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం అంతా మా కుటుంబ సభ్యులు…నియోజకవర్గం మొత్తం ప్రజలు మా కుటుంబ సభ్యులే కనుక వారే ముందుకు తీసుకుపోతారు అన్నారు.
ఇవాళ బతుకమ్మ,దసరా పండుగ వస్తె గోపన్న గుర్తుచేసుకొని జూబ్లిహిల్స్ నియోజకవర్గం ప్రజలు దుఃఖపడుతున్నారు…ఏ పండుగ వచ్చిన గోపన్న నే గుర్తుకు వస్తారు..జూబ్లిహిల్స్ ప్రజలే ప్రాణంగా గోపీనాథ్ పనిచేసేవారు అన్నారు.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్

