భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మగధీర’..

472
Magadheera
- Advertisement -

జక్కన్న రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశం మొత్తం మీద అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మూవీగా రికార్డులకెక్కింది. ఇండియాలోని అన్ని భాషల్లో బాహుబలిని రిలీజ్ చేశారు. అన్ని చోట్ల అభిమానులను మెప్పించింది. ఇక ‘బాహుబలి’ మూవీ రెండు పార్టులు జపాన్‌లో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

Magadheera

ఈ సినిమాకు వచ్చిన ఆదరణను చూసిన రాజమౌళి గతంలో తాను తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రాన్ని కూడా జపాన్‌లో విడుదల చేశారు. ఈ చిత్రం కూడా జపాన్ ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం రిలీజైన పది రోజుల్లోనే రూ.17 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల బాహుబలి సినిమా సమయంలో సుబ్బరాజుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు అక్కడి ప్రేక్షకులు. అప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయి.

ఇప్పుడు మగధీరకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అంతగానూ వైరల్ అవుతున్నాయి. సినిమా తమకెంతో నచ్చిందని దర్శకధీరుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ మూవీ విజయవంతం చేసినందుకు జపాన్‌ ప్రేక్షకులకు హీరో రాంచరణ్ సోషల్‌ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -