నితిన్ ‘మాస్ట్రో’ ట్రైల‌ర్‌కు ముహార్తం ఖరారు..

110
- Advertisement -

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా న‌టిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల‌ర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్‌. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై జ‌బ్ క్రియేట్ చేశాయి.

మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌నున్నారు.

నటీనటులు:నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
సాంకేతిక విభాగం:
డైరెక్షన్, డైలాగ్స్‌: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకేళ్ళ
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మహతి స్వరసాగర్‌
డీఓపీ: జె యువరాజ్‌
ఎడిటర్‌: ఎస్‌ఆర్‌ శేఖర్‌
ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌

- Advertisement -