మదురో అరెస్ట్..ఇంటర్నెట్‌ షేక్!

3
- Advertisement -

వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడూరో అరెస్ట్‌కు సంబంధించిన ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అరెస్ట్ జరిగిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మడూరో చేతులకు బేడీలు వేసి కళ్లకు గంతలు కట్టిన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో మడూరో ధరించిన గ్రే రంగు నైక్ టెక్ ట్రాక్‌సూట్‌నే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడూరోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికన్ దళాలు అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయి. ఈ వివాదాస్పద ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే ఈ ఘటనలో అందరి దృష్టిని ఆకర్షించినది మడూరో ధరించిన దుస్తులే.

ట్రంప్ షేర్ చేసిన ఫోటోలో మడూరో 99 డాలర్ల విలువైన నైక్ టెక్ గ్రే ట్రాక్‌సూట్‌లో కనిపించాడు. సోషల్ మీడియాలో వినియోగదారుల మాటల ప్రకారం మడూరో 3XL సైజ్ ధరిస్తాడని, ఆ సైజ్ నైక్ వెబ్‌సైట్‌లో పూర్తిగా అమ్ముడైపోయిందని కొందరు పేర్కొన్నారు. అయితే జాకెట్, ప్యాంట్‌లు మాత్రం ఇప్పటికీ నైక్ వెబ్‌సైట్‌లో లభ్యమవుతున్నాయి. వాటి ధరలు వరుసగా 140 డాలర్లు, 120 డాలర్లు.

అదనంగా మడూరో 6 డాలర్ల విలువైన Wanme స్లీప్ మాస్క్‌, 11 డాలర్ల Flintronic యాంటీ-నాయిస్ ఇయర్ ప్రొటెక్టర్‌ను కూడా ధరించినట్లు సమాచారం.ఈ ఫోటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిని పర్ఫెక్ట్ హాలోవీన్ కాస్ట్యూమ్ అంటూ సరదాగా వ్యాఖ్యానించగా, మరికొందరు నైక్ టెక్ ఫ్లీస్ కోసం గూగుల్ సెర్చ్‌లు ఒక్కసారిగా పెరిగాయని చెప్పారు.

మడూరో అరెస్ట్ సమయంలో ధరించిన ట్రాక్‌సూట్ దుస్తులు, ట్రాక్‌సూట్‌లకు అభిమానిగా పేరున్న మరో లాటిన్ అమెరికన్ నేత—దివంగత ఫిడెల్ కాస్ట్రోను కూడా చాలామందికి గుర్తు చేశాయి. కాస్ట్రో తన పాలన ప్రారంభ దశలో సైనిక యూనిఫార్మ్‌లు ధరించినప్పటికీ, తరువాత కాలంలో అడిడాస్ అథ్‌లీజర్ దుస్తులను ఎక్కువగా ఇష్టపడేవారు.

Also Read:మోడీ అంటే ఇష్టం అంటూనే..భారత్‌కు ట్రంప్ హెచ్చరిక!

 

- Advertisement -