రజనీ అల్లుడు.. మా కొడుకే !

212
Madurai couple claims Dhanush their son
- Advertisement -

వివాదాలకు దూరంగా రజనీకాంత్ ఫ్యామిలీ ఈ మధ్య తరచుగా మీడియాలోకి వస్తోంది. కొద్ది రోజుల క్రితం రజనీ చిన్న కూతురు సౌందర్య రజనీ కాంత్ విడాకులు తీసుకోబోతుంది అనే వార్త మీడియా లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రజనీ కాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య భర్త ధనుష్ తమ కుమారుడేనంటూ ఓ దంపతులు కోర్టులో పిటిషన్ వేశారు.

Dhanush-01
మదురై జిల్లా మేలూరు సమీపంలోని ఆ.మలంపట్టికి చెందిన కదిరేశన్‌, మీనాళ్‌ దంపతులు ధనుష్‌ తమ కొడుకేనంటూ న్యాయస్థానంలో మేలూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు జనవరి 12న హాజరు కావాలని ధనుష్‌కు సమన్లు జారీ చేసింది.

ఈ పిటిషన్‌లో వారు ధనుష్‌ తమ కుమారుడని, అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ధనుష్‌ తమ కుమారుడేనని చెప్పడానికి పలు ఆధారాలు ఉన్నాయని, పదో తరగతి వరకు మేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని, ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని, అవి చాలవంటే డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమేనని పేర్కొన్నారు.

Dhanush-02

తాము కుమారుడితో కలిసి జీవించాలని భావిస్తున్నామని, పిటిషన్‌ శుక్రవారం విచారణకు రాగా ధనుష్‌ను జనవరి 12న న్యాయస్థానానికి హాజరు కావాలని సమన్లు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. ధనుష్‌ మ్యారేజ్ సమయం లో ఓ వ్యక్తి ఈ హీరో తమ కొడుకని, మాకు అప్పగించాలంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిపై ధనుష్‌ ఫాదర్, డైరెక్టర్ కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వివాదం కాసింత సద్దు మణిగింది. ఇంతకీ ధనుష్.. డైరెక్టర్ కస్తూరి‌రాజా కొడుకా? కాదా? నిజమేంటని? అంటూ కోలీవుడ్‌ చర్చ నడుస్తుంది.

- Advertisement -