విజయ్‌కి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..!

87
vijay

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి గట్టి షాక్ తగిలింది. తన లగ్జరీ కారు దిగుమతి చేసుకున్నందుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ని తిరస్కరించిన న్యాయస్ధానం…రూ లక్ష జరిమానా విధించింది. ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని సూచించింది.

హీరో విజయ్‌కి కార్లు అంటే అమితమైన ఇష్టం. పాత కాలపు వాహనాలతోపాటు.. బీఎమ్‏డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు విజయ్ దగ్గర ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు విజయ్. దీనికి పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్ధానం…స్టార్ హీరోలు పన్ను కట్టేందుకు వెనుకడాతున్నారని..కారుకు పన్ను కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించింది.