మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పాఠశాల పిల్లల్లో వ్యాప్తి చెందుతోంది ఈ వైరస్. 12 ఏళ్ల లోపు చిన్నారులలో ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది వైరస్.
ఇది సోకిన చిన్నారుల చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో దద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలతో బాధ పడే చిన్నారులను ఇంటి వద్దే ఉంచాలని అప్రమత్తం చేస్తున్నాయి పాఠశాలల యాజమాన్యాలు.
ఈ టమోటా ఫ్లూ వైరస్‌ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (HFMD) అంటారు. ఎచినోకాకస్, కాక్స్‌సాకీ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. 6 నెలల నుంచి 12 సంవత్సరాల వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది సాధారణ సమస్యేనని, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదని, వారం, పది రోజుల్లో ఈ వైరస్ దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు.
దేశంలో తొలిసారి ఈ వైరస్ 2022 మే నెలలో కేరళలో వెలుగుచూసింది. తర్వాత తమిళనాడు, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో టమాటా వైరస్ కేసులు బయటపడ్డాయి.
Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

