- Advertisement -
లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రైతులకు బేడీలపై వాయిదా తీర్మానం ఇచ్చాము దాన్ని తిరస్కరించారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు. లగచర్ల రైతులకు ప్రభుత్వం ద్రోహం చేసింది అక్రమ అరెస్టులు చేసింది..ప్రభుత్వం సమాధానం చెప్పాలని వాయిదా తీర్మానం ఇస్తే సభను వాయిదా వేశారు అన్నారు.
సభ ఎప్పుడు జరిగిన ఇదే అడుగుతాం ప్రశ్నిస్తాము…ఓటుకు నోటు కేసులో జైలు పాలయిన ముఖ్యమంత్రి అందరిని జైలుకి పంపాలని అనుకుంటున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురు దాడులు చేస్తున్నారు..ప్రశ్నించే వాళ్ళను జైలుకు పంపుతున్నరూ చట్ట సభల్లో కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్
- Advertisement -