కౌశిక్ రెడ్డిపై దాడి ప్రభుత్వ ప్రేరేపిత చర్యే!

10
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించారు మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూధనాచారి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని చెప్పారు. కౌశిక్‌ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్‌ గూండాలను దాడికి వదిలేశారని ఆరోపించారు.

కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్‌ఎస్‌ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ ఫైర్‌ అయ్యారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆయనను పరామర్శించారు. తన ఇంటిపై జరిగిన దాడిని పల్లాకు వివరించారు. ఆయన ఇంటి వద్ద పగిలిన అద్దాలను పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పరిశీలించారు.

Also Read:KTR: సీఎం రేవంత్ ప్రొద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి

- Advertisement -