బీజేపీకి ఫుల్ గిరాకీ..గుంటూరు బరిలో నటి మాధవీలత..!

321
madhavilata bjp
- Advertisement -

ఓ వైపు ఏపీలో వైసీపీ,టీడీపీ మధ్య జంపింగ్ జపాంగ్‌లతో నువ్వా నేనా అన్నట్లు పొలిటికల్ వార్ నడుస్తుండగా మరోవైపు జనసేన,బీజేపీ పార్టీ అభ్యర్థిత్వం కోసం కూడా గట్టిపోటీ నెలకొంది. ఏపీ అభివృద్ధి బీజేపీ వల్లే ఆగిపోయిందని ప్రచారం జరుగుతున్న ఆ పార్టీ నుండి పోటీచేసేందుకు చాలామంది ఆసక్తిచూపిస్తున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసుందుకు 300కి పైగా దరఖాస్తులు రాగా ఎంపీ ఎన్నికల్లో సైతం కాషాయం పార్టీ నుండి పోటీచేసుందుకు సీనియర్ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆశావాహులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇక ఇటీవలె బీజేపీలో చేరిన సినీనటి మాధవీలత గుంటూరు పశ్చిమ నుండి పోటీచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గుంటూరు జిల్లా నుండి మాధవీలతను బరిలోకి దించడం ద్వారా పార్టీకి సినీ గ్లామర్ అద్దడంతో పాటు కలిసివస్తుందని కమలం నేతలు భావిస్తున్నారట. దీనికి మాధవీలత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది మాధవీలత. కన్నడ కుట్టి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మాధవీలత చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. కన్నడలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మాధవీలత తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్‌ వీరాభిమాని అయిన మాధవీలత బీజేపీలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక మాధవీలత బీజేపీలో చేరినప్పడి నుండే ఆమె రానున్న ఎన్నికల్లో పోటీచేస్తారనే వార్తలు వెలువడుతుండగా ఆ వార్తలకు బలం చేకూరుస్తు గుంటూరు నుండి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఇక 25 పార్లమెంట్‌ స్ధానాలకు 50కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో పాటు మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు బీజేపీ నేతలు.

- Advertisement -