అనసూయ-రష్మిలతో ఢీ అంటున్న హీరోయిన్‌..

637
Madhavi Latha back to anchoring on TV
- Advertisement -

నచ్చావులే మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది మాధవీలత. ఆ సినిమా హిట్ కావడంతో మంచి క్రేజ్ కూడా వచ్చింది ఈ భామకు. ఆ తర్వాత నానితో స్నేహితుడాలో హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ చిత్రాలపై కన్నేసిన ఆమెకు అక్కడా పెద్దగా గుర్తింపురాలేదు. బోల్డ్ పాత్రలకు సై అంటున్న మాధవీలతకు ఆఫర్లు ఇచ్చే వాళ్లు కరువయ్యారు. దీంతో ఈ భామ దృష్టి ఇప్పుడు బుల్లితెరపై పడింది.

  anasuaya

బుల్లితెరపై హాట్ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ-రష్మిలతో ఢీ కొట్టడానికి రెడీ అవుతోందట మాదవీలత. ఓ ఛానల్‌లో జబర్దస్త్‌కి పోటీగా రాబోయే షోలో మాధవీలత యాంకర్‌గా చేయబోతోందట. నాగబాబు-రోజాలకు పోటీగా రమ్యకృష్ణ-పోసాని జడ్జీలుగా వ్యవహరిస్తారట.

posani

మాధవీలత కెరియర్ ను యాంకర్‌గానే ప్రారంభించింది. ఆ క్రమంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. హీరోయిన్ గా కెరియర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెర‌పై రీఎంట్రీకి సిద్ధమవుతోంది. మరీ ఇప్పుడున్న హాట్ యాంకర్ల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని మాధవీలత నెగ్గుకురాగలుగుతుందా? చూడాలి.

anchor-reshmi-best-performances-1024x576

Anchor Anasuya Latest Hot Stills 7

- Advertisement -