అనుష్క ‘సైలెన్స్‌’ వీడింది..!

338
anushka madhavan
- Advertisement -

భాగుమ‌తి విడుద‌ల త‌ర్వాత మరే సినిమాకు కమిట్ కాలేదు. పెరిగిన బ‌రువు త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా విదేశాల‌కి వెళ్లింద‌నే వార్త‌లొచ్చాయి. ప్రేమకథా చిత్రాల ఫేమ్ గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయింది. ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది.

అనుష్కతో పాటు మాధవన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాదు ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. సైలెన్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

అనుష్క, మాధవన్‌ ఇదివరకు ‘రెండు’ (2006) అనే తమిళ సినిమాలో తొలిసారి కలసి నటించారు. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి నటించబోతున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది స్టార్ట్‌ కానుంది.

- Advertisement -