మ్యాడ్..ట్రైలర్

34
- Advertisement -

వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బావమరిది నార్నే నవీన్. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని లాంఛ్ చేశారు ఎన్టీఆర్. ట్రైలర్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పాలి. ముగ్గురు ఫ్రెండ్స్ నడుమ జెనరేట్ అయ్యే ఫన్ ,కాలేజ్ సీక్వెన్స్ బాగున్నాయి. భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. ఇక హీరో నితిన్ డీసెంట్ లుక్స్ అండ్ యాక్టింగ్ తో కనిపిస్తున్నాడు.

యాక్షన్ లాంటివి ఏమీ లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ తోనే కట్ చేసిన ఈ టీజర్ లో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా ఓ పాత్రలో కనిపించడం అని చెప్పాలి.

Also Read:ఈ ఆసనాలు వేస్తే.. మతిమరుపు దూరం!

- Advertisement -